Friday, April 19, 2024

పొద్దుతిరుగుడులో కొత్త వంగడం

- Advertisement -
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎఫ్‌హెచ్-700గా నామకరణం
హెక్టార్‌కు 22క్వింటాళ్ల దిగుబడి 40% నూనె

మనతెలంగాణ/హైదారాబాద్: నూనెగింజ పంటల పరిశోధనల్లో కొత్త రకం వంగడాలు పురుడు పోసుకుంటున్నాయి. తాజాగా పొ ద్దుతిరుగుడు పంటలో నూనె అధికంగా ఉండి , అధిక దిగుబడులు అందించే మరో కొత్తరకం వంగడం రూపొందింది. పొరుగున ఉన్న కర్ణాటకలోని రాయచూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొద్దు తిరుగుడు విభాగం శాస్త్రవేత్తలు రెండేళ్లపాటు పరిశోధనలు చేసి కొత్తవంగడాన్ని రూపొందించి, ఆర్‌ఎస్‌ఎఫ్ హెచ్700గాపే రు పెట్టారు. 95రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ కొత్త వంగడం వర్షాధారం కింద హెక్టారకు 16 క్వింటాళ్లు, నీటి ఆధారం కింద 22క్వింటాళ్ల దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్త డా.వికాస్ కులకర్ణి వెల్లడించారు. దిగుబడి లభిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News