ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీ రిటైర్మెంట్ తనను షాక్‌కు గురిచేసిందన్నాడు. మరికొన్నేళ్ల పాటు ధోనీ భారత జట్టులో కొనసాగుతాడని తాను భావించానని పేర్కొన్నాడు. అయితే ధోనీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి తనతో పాటు చాలా మందిని నిరాశకు గురి చేశాడన్నాడు. ఇక భారత క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోనీ ఒకడని ప్రశంసించాడు. అతనిలాంటి ఆటగాడు దొరకడం చాలా కష్టమన్నాడు. ఇక తాను చనిపోయే రెండు నిమిషాల ముందు ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌ను చూస్తూ లోకాన్ని విడిచి పెట్టాలని కోరుకుంటానని గవాస్కర్ భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను పెట్టాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుండగా ధోనీ రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. ఈ సందర్భంగా రెండు పేజీల సుదీర్ఘ లేఖను ప్రధాని పోస్ట్ చేశారు. తాజాగా గవాస్కర్ కూడా ధోనీని అభినందిస్తూ ట్విట్ చేశాడు.
Sunil Gavaskar Emotional Tweet on Dhoni’s Retirement