Thursday, March 28, 2024

ధోనీపై మాజీల ఫైర్..

- Advertisement -
- Advertisement -

ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రచించిన వ్యూహాలను పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. కీలక సమయంలో ధోనీ తీసుకున్న నిర్ణయాలు జట్టు గెలుపు అవకాశాలను దూరం చేశాయని విమర్శించారు. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌తో సహా ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, మైఖేల్ వాన్ తదితరులు ధోనీ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే రాజస్థాన్ చేతిలో చెన్నైకి పరాజయం ఎదురైందని వాపోయారు. భారీ లక్షం ఛేదిస్తున్న సమయంలో ఏ మాత్రం అనుభవం లేని రుతురాజ్ సింగ్, శామ్ వంటి యువ ఆటగాళ్లను ముందుగా పంపించడాన్ని వారు తప్పుపట్టారు. అంతేగాక తొలి మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెన్నైని గెలిపించిన అంబటి రాయుడిని పక్కన బెట్టి కూడా ధోనీ పెద్ద తప్పు చేశాడని పేర్కొన్నారు. అంతేగాక ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ తీరు కూడా అతని స్థాయికి తగ్గట్టుగా లేదన్నారు. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితుల్లో సింగిల్స్‌కే పరిమితం కావడంపై విమర్శలు గుప్పించారు. గతానికి భిన్నంగా ధోనీ కెప్టెన్నీ మారిందని, దీన్ని మార్చుకుంటూనే చెన్నైకి మెరుగైన అవకాశాలుంటాయని వారు సూచించారు.

Sunil Gavaskar slams on Dhoni after RR defeat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News