Home తాజా వార్తలు కోహ్లిని నిందించడం తగదు: సునీల్ గవాస్కర్

కోహ్లిని నిందించడం తగదు: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar supports Kohli over RCB Exit from IPL

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలుకావడంపై కొంత మంది నెటిజన్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అతని సహచరులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలు ఏమాత్రం సమంజసంగా లేవని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు ఓడినా చివరి వరకు విజయం కోసం పోరాడిన విషయాన్ని అభిమానులు గుర్తుంచుకోవాలన్నాడు. ఆటలో ఏదో ఒక జట్టు మాత్రమే గెలుస్తుందని, మరో జట్టుకు ఓటమి తప్పదనే విషయాన్ని అభిమానులు తెలుసుకోవాలన్నాడు. జట్టు ఓటమికి బాధ్యుడ్ని చేస్తూ కోహ్లిపై విమర్శలు గుప్పించడం తనను బాధకు గురిచేసిందన్నాడు. ఈ సీజన్‌లో కోహ్లి టీమ్ బాగానే ఆడిందన్నాడు. లీగ్ దశలో నిలకడైన విజయాలను సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇక కెప్టెన్‌గా ఆడిన చివరి సీజన్‌లో జట్టును విజేతగా నిలబెట్టడంలో విఫలమైన కోహ్లి బాధను తాను అర్థం చేసుకోగలనన్నాడు. ఆటలో ప్రతి ఒక్కరూ ఘనమైన ముగింపు ఇవ్వాలని అనుకుంటారని, అయితే అన్నీ మనం అనుకున్నట్టు జరగవని గవాస్కర్ పేర్కొన్నాడు.

Sunil Gavaskar supports Kohli over RCB Exit from IPL