Tuesday, January 31, 2023

రేపటి నుంచి సెట్స్‌పైకి

- Advertisement -

sunilసునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ మూవీ ‘2 కంట్రీస్’కు రీమేక్‌గా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మహాలక్ష్మి ఆర్ట్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ “మలయాళంలో దాదాపు 55 కోట్ల రూపాయలు వసూలు చేసిన సూపర్ హిట్ చిత్రం ‘2 కంట్రీస్’. ఆ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సునీల్ సరసన కథానాయిక ఎవరనేది త్వరలో ప్రకటిస్తాం. ఎక్కువ శాతం షూటింగ్‌ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో కొద్దిగా మార్పులు చేశాం. మలయాళ వర్షన్‌కు సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందరే తెలుగు వర్షన్‌కూ సంగీతాన్ని సమకూర్చనున్నారు. శ్రీధర్ సీపాన సంభాషణలు అందిస్తారు”అని అన్నారు. నరేష్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీః సి.రాంప్రసాద్, కళః ఎ.ఎస్.ప్రకాష్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles