Home తాజా వార్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి

టీఆర్‌ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి

Sunitha Laxma Reddy

 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సోమవారం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పలువురు నేతలు కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. కెటిఆర్ సునీతకు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే సిఎం కెసిఆర్ నాయత్వంలో పని చేయాలని టిఆర్ఎస్ లో చేరానన్నారు. కాంగ్రెస్ లో కష్టపడే వారికి గుర్తింపు లేదని, ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నరని తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నర్సపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్‌ రావు, పద్మాదేవేందర్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Sunitha Laxma Reddy join in TRS