Home తాజా వార్తలు తుంగభద్రకు భారీ వరద

తుంగభద్రకు భారీ వరద

Sunkesula gates lifted of water released to srisailam

 

నాగర్‌కర్నూల్ : తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో తుంగభద్ర డ్యాం అధికారులు తెలంగాణ, శ్రీశైలం ప్రాజెక్టు , సుంకేసుల ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేస్తూ ఫ్యాక్స్ మెసెజ్‌లను అందించింది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1663 అడుగులు, టిఎంసీలలో 100.855 టిఎంసిలుగా ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్‌కు శుక్రవారం నుంచి 50వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. శనివారం రాత్రికి లక్ష క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరే అవకాశాలు ఉండడం, డ్యాం పూర్తిస్థాయిలో నిండడంతో ఇప్పటికే అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు.

మరింత వరద పెరిగే అవకాశాలు ఉండడంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతంతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టుల అధికారులు ప్రభుత్వాలను కర్ణాటక అధికారులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరే అవకాశాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమై ఏడు గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 10 వేల 44 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం రాత్రికి మరింత వరద పెరిగే అవకాశాలున్నట్లు సుంకేసుల డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 856.20 అడుగులుగా నమోదైంది. టిఎంసిలలో 215.807 టిఎంసీలకు గానూ ప్రస్తుతం 95.1368 టిఎంసీలుగా నమోదైంది.

Sunkesula gates lifted of water released to srisailam