Friday, March 29, 2024

65లోకి సన్నీ డియోల్

- Advertisement -
- Advertisement -

Sunny Deol 65
ముంబయి: హిందీ సినీ నటుడు సన్నీ డియోల్‌కు మంగళవారం 65 ఏళ్లు వచ్చాయి. అతడి జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమలో సన్నీ డియోల్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అతడు లోక్‌సభ సభ్యుడు కూడా. ఆయనను 2013లో ఓ వార్తాపత్రిక విలేకరి ఇంటర్వూ చేస్తూ ‘మీ అమ్మ ప్రకాశ్ కౌర్, భార్య పూజా డియోల్ ఎందుకు సినీ జిలుగువెలుగులకు దూరంగా ఉంటున్నారు?’ అని అతడిని అడిగినప్పుడు ఆయన, ‘అది వారి ఇష్టానికి సంబంధించింది’ అని జవాబు ఇచ్చారు. అంతేకాక తాను గానీ, తన తండ్రి ధర్మేంద్ర గానీ ఇంటి ఆడవాళ్లపై ఎలాంటి నియమాలు రుద్దలేదని పేర్కొన్నారు. ఆయన సోదరీమణులు అజీతా డియోల్, విజేత డియోల్ కూడా తమదైన పంథాను అనుసరించారు. వారు కూడా సినీ జిలుగు వెలుగులకు దూరంగా ఉండిపోయారు.

సన్నీ డియోల్ త్వరలో తన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, తన కుమారుడు కరణ్ డియోల్‌తో కలిసి నటించిన సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాను దీపావళి వరకు విడుదలచేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాంతరాల వల్ల ఆలస్యం అవుతోంది. సన్నీ డియోల్ 1983లో ‘బేతాబ్’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. అతడి అనేక సినిమాలు హిట్లు కొటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News