Home కెరీర్ సన్నీకి పెరుగుతోన్న ఫాలోవర్స్

సన్నీకి పెరుగుతోన్న ఫాలోవర్స్

Sunny's growing followers

బాలీవుడ్ తార సన్నీలియాన్ కెరీర్‌లో ఎన్నో షాకింగ్ నిజాలున్నాయి. బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కరణ్‌జిత్ కౌర్ అలియాస్ సన్నీలియాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే సన్నీ జీవితంపై తెరకెక్కిన ‘కరణ్‌జిత్ కౌర్ – ది అన్‌టోల్ స్టోరీ ఆఫ్ సన్నీలియాన్’ వెబ్ సిరీస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఆదరణ దక్కుతోంది. అయితే సన్నీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. భర్త డేనియల్ వెబర్‌తో కలిసి స్టార్ స్టక్ అనే కంపెనీని ప్రారంభించి సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఈ బిజినెస్ రోజురోజుకు పెద్ద రేంజ్‌కు వెళ్తోందని సన్నీ చెబుతోంది. ఇక తన వ్యాపారానికి మంచి ప్రచారం చేస్తోంది ఈ భామ. ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీకి 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ సహా సామాజిక మాధ్యమాల ద్వారా స్టార్‌స్టక్ ఉత్పత్తులకు విపరీతమైన ప్రచారం చేస్తోంది. అదేవిధంగా తన హాట్ హాట్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో సన్నీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు.