Thursday, March 28, 2024

గెలిచి నిలిచింది

- Advertisement -
- Advertisement -

Sunrisers solid win over Delhi

 

సాహా, వార్నర్ మెరుపులు n రషీద్ మ్యాజిక్ n ఢిల్లీపై సన్‌రైజర్స్ ఘన విజయం

దుబాయి: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టి పోరాటంతో అదరగొట్టింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ఢిల్లీని కోలుకో నివ్వలేదు. రషీద్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. సందీప్, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ (36), అజింక్య రహానె (26) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు విఫలమయ్యారు.

వార్నర్, సాహా జోరు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా శుభారంభం అందించారు. ఇద్దరు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. సాహా కాస్త సమన్వయంతో ఆడగా, వార్నర్ దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు కుదురుగాఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని మ్యాచులుగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వార్నర్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే జోరు మీద కనిపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ 34 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించాడు.

తర్వాత వచ్చిన మనీష్ పాండేతో కలిసి సాహా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అప్ప టి వరకు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన సాహా తర్వాత చెలరేగి పోయాడు. ఢిల్లీ బౌలర్లను హడలెత్తించిన సాహా స్కోరును పరిగెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సాహా 45 బంతుల్లోనే 12 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మనీష్ పాండే తనపై వేసుకున్నాడు. విలియమ్సన్ 11 (నాటౌట్) అండగా నిలిచాడు. ధాటిగా ఆడిన పాండే 31 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News