Wednesday, April 24, 2024

హైదరాబాద్‌కు ఓదార్పు

- Advertisement -
- Advertisement -

Sunrisers win over Bangalore

రాణించిన బౌలర్లు, మాక్స్‌వెల్ శ్రమ వృథా, బెంగళూరుపై సన్‌రైజర్స్ గెలుపు

అబుదాబి: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓదార్పు విజయం లభించింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళష్త్రరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (5), డానియల్ క్రిస్టియాన్ (1) నిరాశ పరిచారు. కోహ్లిని భువనేశ్వర్ వెనక్కి పంపించాడు. మరో క్రిస్టియాన్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. కేవలం ఒక పరుగు మాత్రమే చేసి సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన శ్రీకర్ భరత్ కూడా నిరాశ పరిచాడు. 12 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ దేవ్‌దుత్ పడిక్కల్ తన పోరాటాన్ని కొనసాగించాడు. అతనికి గ్లెన్ మాక్స్‌వెల్ జతకట్టడంతో బెంగళూరు కోలుకుంది.

ఇద్దరు కలిసి హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. పడిక్కల్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయగా, మాక్స్‌వెల్ ధాటిగా ఆడాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పడిక్కల్ 4 ఫోర్లతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు ధాటిగా ఆడిన మాక్స్‌వెల్ 25 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కీలక సమయంలో మాక్స్‌వెల్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో డివిలియర్స్ 19 (నాటౌట్), షాబాద్ అహ్మద్ (14) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్ జాసన్ రాయ్, కెప్టెన్ విలియమ్సన్‌లు మాత్రమే రాణించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 38 బంతుల్లో ఐదు ఫోర్లతో 44 పరుగులు చేశాడు. విలియమ్సన్ 4 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. ప్రియమ్ గార్గ్ (15), వృద్ధిమాన్ సాహా (10), హోల్డర్ (16) తమవంతు పాత్ర పోషించారు. దీంతో హైదరాబాద్ స్కోరు 141 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News