Thursday, April 25, 2024

సన్‌స్టోన్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దేశంలో అగ్రగామి ఉన్నత విద్య స్టార్టప్‌లలో ఒకటి కావడంతో పాటుగా 35 కు పైగా నగరాలలో 50కు పైగా ఇనిస్టిట్యూషన్‌లు కలిగిన సన్‌స్టోన్‌ సంస్ధ పాఠశాల విద్యార్థుల కోసం నేషనల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ను నిర్వహించింది. పన్నెండవ తరగతి విద్యార్ధులు తమ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు ఎంచుకోవడంలో సహాయపడే రీతిలో దేశవ్యాప్తంగా 2000 వేలకు పైగా పాఠశాల మద్దతుతో నిర్వహించిన ఈ స్కాలర్‌షిప్‌ పరీక్షలో 1.5 లక్షల మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు.

దేశంలో అతిపెద్ద స్కాలర్‌షిప్‌ పరీక్షగా నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా 100కు పైగా కాలేజీలలో విద్యార్ధులు ప్రవేశాలను పొందేందుకు అవకాశం కలుగుతుంది. అదనంగా, సన్‌స్టోర్‌ అడ్వాంటేజ్స్‌ ను అందించే కాలేజీలలో ఒక లక్ష రూపాయల వరకూ స్కాలర్‌షిప్‌ గెలిచేఅవకాశం ఉంది.

సన్‌స్టోన్‌ కో–ఫౌండర్‌ మరియు సీబీఓ అంకుర్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘దేశంలో అతిపెద్ద స్కాలర్‌షిప్‌ పరీక్షగా 2000కు పైగా పాఠశాలల సహకారంతో దీనిని నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను అందించనున్నాము. ఆర్థిక అవరోధాలు విద్యార్థుల కెరీర్‌కు అవరోధం కాకూడదని సన్‌స్టోన్‌ వద్ద మేము భావిస్తుంటాము. ఈ కార్యక్రమం ద్వారా ఒక లక్ష రూపాయల వరకూ విలువైన స్కాలర్‌షిప్స్‌ను అందించనున్నాము’’ అని అన్నారు.

ఈ పరీక్షను 16–20 జనవరి 2023 తేదీలలో నిర్వహించారు. ఫలితాలను 16 ఫిబ్రవరి 2023న విడుదల చేయనున్నారు. బీబీఏ, బీసీఏ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లతో పాటుగా అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులలో చేరేందుకు విద్యార్ధులకు ఇది సహాయపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News