Home తాజా వార్తలు ‘సూపర్ డీలక్స్’ నుంచి ట్రైలర్ విడుదల

‘సూపర్ డీలక్స్’ నుంచి ట్రైలర్ విడుదల

Super Deluxeసినిమా: టి.కుమారరాజా డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, సమంత.. ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయి కొంతకాలమైనా, కొన్ని కారణాల వలన రిలీజ్ విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను కట్ చేసిన ఈ ట్రైలర్ చిత్రంపై ఆసక్తిని పెంచేలా వుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో జోరుగా వినిపిస్తోంది. ఇక విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్ కూడా ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. రెండు భాషల్లోను సమంతకి ఒకేసారి హిట్ పడుతుందేమో చూడాలి మరీ.

Super Deluxe – Official Trailer