Friday, March 29, 2024

నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

- Advertisement -
- Advertisement -

Super specialty hospitals all over the hyderabad

ఛాతి ఆసుపత్రి, అల్వాల్‌లో భారతీయ విద్యభవన్,గడ్డిఅన్నారం మార్కెట్‌ను సందర్శించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
త్వరలో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడుతామని వెల్లడి

హైదరాబాద్:  వైద్య విషయంలో హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలోని ప్రజలు ఇబ్బంది పడకూదన్న దృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మంజూరీ చేశారు చేసినట్లు రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలో టీమ్స్‌ను కోవిడ్ సమయంలో ఏర్పాటు చేశారని మిగతావి చాతి ఆసుపత్రి ఆవరణలో, అల్వాల్, గడ్డిఅన్నారంలోను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి క్షేత్రస్దాయిలో పరిశీలించుటకు ఛాతి ఆసుపత్రిని, అల్వాల్‌లోని భారతీయ విద్య భవన ప్రాంగణాన్ని సందర్శించారు. వీరు అక్కడి పరిస్దితులను పరిశీలించి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గడ్డి అన్నారంలో ఆసుపత్రులు చేపట్టేందుకు పండ్ల మార్కెట్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమావేశమై 15 రోజుల్లో మార్కెట్‌ను తరలించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం కెసిఆర్ ఈఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్ అండ్ బి శాఖకు ఇచ్చి వాటి నిర్మాణాన్ని చేపట్ట వలసిదిగా కోరారని తెలిపారు. హైదరాబాద్ చుట్టపక్కల ఉన్న జిల్లాల ప్రజలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వీటి నిర్మాణ బాధ్యతను మాకు అప్పగించినందుకు వారికి మన స్పూర్తిగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఛాతి ఆసుపత్రి సందర్శనలో పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్దానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కార్పొరేటర్లు, డిఎంఈ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే అల్వాల్‌లోని భారతీయ విద్యభవన్ ప్రాంగణంలో ఆసుపత్రి పరిశీలనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శ్వేతా మహాంతి, గడ్డి అన్నారం ఆసుపత్రి కోసం కేటాయించిన పండ్ల మార్కెట్ స్దలాన్ని ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ స్దానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News