Home మంచిర్యాల వాహన పత్రాలను వెంబడి ఉంచుకోవాలి

వాహన పత్రాలను వెంబడి ఉంచుకోవాలి

Police

బెల్లంపల్లి: ఆటో డ్రైవర్లు వాహనానికి సంబంధిత అన్ని పత్రాలు వెంబడి ఉంచుకోవాలని బెల్లంపల్లి ఎసిపి సతీష్ అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని తాపీమేస్త్రీ భవన్‌లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎసిపి సతీష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, మద్యం సేవించి ఆటో నడుపవద్దని అన్నారు. ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దని కోరారు. ఓవర్ స్పీడ్,ఓవర్ టేక్ వెళ్ళడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మద్యంసేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరీముల్లాఖాన్,రఘు, ఎస్సైలు శ్రీనివాస్, గంగారాజ గౌడ్,మల్లేశం, ఎఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.