Home జోగులాంబ గద్వాల్ నిరుపయోగంగా నీటిశుద్ధ్ది కేంద్రం

నిరుపయోగంగా నీటిశుద్ధ్ది కేంద్రం

water treatment center

 

ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తుప్పుపట్టి శిథిలమైపోతున్న యంత్రసామాగ్రి
ఎండుతున్న తైబజారు వ్యాపారుల గొంతులు

గట్టు : మండలంలోని స్థానిక తైబజారు వద్ద 2008లో గత ప్రభుత్వం 5 లక్షల వ్యయంతో హైదరాబాద్ ప్రైవేటు కంపెణీ వ్యక్తులకు నిర్మాణ పనులను అప్పగించి ప్రజల తాగునీటి అవసరాలకై నీటి శుద్ధ్ది కేంద్రాన్ని నిర్మించింది. నిర్మాణానికి సంబంధించి పనులని పూర్తిచేసి నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని అమర్చి కొన్ని రోజుల పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన తాగునీటి పైప్‌లైన్‌తో నీటిని ఉపయోగించుకొని ప్రజలకు 5రూ.10లీటర్ల మంచినీటిని అమ్మెవారు.

ప్రజాప్రతినిధులు నీటి శుద్ధి కేంద్రానికి పంచాయతీ బోర్లను ఉపయెగించడం ద్వారా ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పాడుతుందని దానికి సంబంధించిన నిధులతో బోరు వేయ్యలని అయ్యాయని జిల్లాపంచాయతీ రాజ్ అధికారికి ఫిర్యాదు చెయ్యడంతోనీటి శుద్ధ్ది కేంద్రానికి నిటీ సదుపాయం నిలివేశారు. సదరు కాంట్రాక్టర్ తాగునీటి బోరును వెయ్యకుండా అధికారులకు కొంత మేరకు డబ్బులను ఇచ్చి పూర్తి బిల్లును తీసుకొని ఉడాయించాడు. ఇలా కొన్ని ఏండ్లు గడుస్తున్న యంత్రాలను ఉపయోగించుకోక పోవడంతో యంత్రసామాగ్రి తుప్పుపట్టి శీథిలమైపోతున్నాయి .ప్రజలు ప్రైవేటు కంపెణీలతో 10లీటర్ల క్యానుకు 30రూ. లను చేల్లించి నీటిని కొనుక్కుని దాహన్ని తీర్చుకుంటున్నారు.

దీనివిషయమై పలుమార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళిన నీటి శుద్ధ్ది కేంద్రానికి కొత్తగా బోరు వేయించేందుకు నిధులు లేవని సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వేళతామని చేబుతూ కాలాన్ని వేళ్లదీస్తున్నారు. ముఖ్యంగా ప్రతి బుధవారం తైబజారుకు దాదాపు 5 వందల మంది వ్యాపారస్తులు కూరగాయలు,పండ్లు,స్వీట్లు, బట్టలు, కిరాణం5వందల మందికిపైగా వ్యా పరస్తులు లావదేవీలు జరుపుతుంటారు. వారికి తాగటానికి నీరులేక బస్టాండ్ కూల్‌డ్రింక్ షాపులలో 1లీటరు నీటికి 5రూ. యలు చేల్లించి తమ దాహన్ని తీర్చుకుంటున్నారు.

కొంత మంది తమ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న కొద్దిపాటి నీటిని ఉపయోగించుకొని ఎండుతున్న గొంతును తడుపుకుని తృప్తి పడుతున్నారు.. మరో వైపు స్థానిక ప్రజలకు వాటర్ ట్యాంక్ ద్వారా వదులుతున్న నీరు పరిశుభ్రంగా లేక పొవడంతో ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రం వ్యాపారుల ద్వారా 10లీటర్‌ల తాగునీరుకు 30రు. డబ్బును చేల్లించి కోన్నుకుంటున్నా రు. నీరు అపరిశుభ్రంగా ఉన్నాయని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకుని వేళ్ళిన పట్టించు కోకపోవడంతో చేసెదేమి లేక నీటి కొన్నుకునే పరిస్థితి ఏర్పాడిందివాపొయారు. తైబజారు వ్యాపరులు, మరి యు ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతి నిధులుతాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Superfluous water treatment center