Saturday, March 25, 2023

రైతులకు మద్దతు ధర చెల్లించాలి

- Advertisement -

lady-collectoro*మార్కెటింగ్ శాఖా మాత్యులు హరీష్‌రావు
మనతెలంగాణ/పెద్దపల్లి: అర్హులైన రైతుల వద్ద చివరి గింజ వరకు మ ద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని భారీ నీటిపారుదల మరియు మార్కెటింగ్ శాఖ మాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. రైతులకు మద్దతు చెల్లింపు కేంద్ర ప్రభుత్వం సహకారం మార్కెట్లలో జ రుగుతున్న లోపాలు తదితర అంశాలపై వ్యవసాయ మరియు కార్పొరే టివ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ పార్థసారథీతో కలసి 31 జిల్లా కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం కేటాయింపులు చాలా తగ్గిం చిదని, గత సంవత్సరం రాష్ట్రంలో 2లక్షల మెట్రిక్ టన్నుల కందులను కనీసం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, ఈ సంవత్పరం మ ద్దతు ధరకు కొనుగోలు పై74000 మెట్రిక్ టన్నులకు పరిమితం చేసిం దని,కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 140000 మెట్రిక్ టన్నుల క ందులను కోనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 5450 రూ.మ ద్దతు ధర అందించడం వలన కొన్ని చోట్ల దళారులు, మధ్యవర్తులు , వ్యాపారులు కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయిస్తున్నారని ఇలాంటి వారిని గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను కేంద్ర ప్రభుత్వానికి పంపే పంటను వేరువేరుగా నిల్వ చేయాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం శనగలు, పల్లి కాయను రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి కోనుగోలు చేయడానికి నిర్ణయించిదని కేవలం మార్కెట్ యార్డుల్లో మాత్రమే కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ,రాష్ట్రానికి 50వేల టన్నుల శనగలు , 96వేల టన్నుల పల్లికాయ కోనుగోలుకు ఏర్పాటు చేయాలని తెలిపారు.పల్లి కాయ ఎక్కవగా పండే 16 జిల్లాలో మార్కెటింగ్ యార్డలలో 27 కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోనుగోలు చేయాలని శనగలు పండే 12 జిల్లా లో 23 కోనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని , రైతులకు మద్దతు ధర  కంటే తక్కువ ధర కు మార్కెట్‌లో విక్రయిస్తున్న సమయంలో మాత్రమే మనం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ,జెసిలు , వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు నష్టం జరగకు ండ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జి ల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News