న్యూఢిల్లీ: సినిమా హక్కుల లావాదేవీల విషయంలో ఓ ప్రైవేట్ ప్రకటనల సంస్థకు రెండు వారాల్లోగా రూ.6.2కోట్లు చెల్లించాలని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యకు సుప్రీం కోర్టు ఆదేశించింది. ‘కొచ్చాడియన్’ సినిమా హక్కులపై చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో ఆఫ్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. కేసును పరిశీలించిన సుప్రీం కోర్టు తీర్పును పైతీర్పును వెల్లడించింది. యాడ్ బ్యూరోకు రెండు వారాల్లోగా రూ.6.2 కోట్లు తిరిగివ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.
నగదు మొత్తాన్ని ‘మీడియా వన్ గ్లోబల్ ఎంటర్ టైన్మెంట్’ సంస్థ చెల్లించాల్సివుంటుంది. కాగా, ఈ సంస్థకు రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ డైరెక్టర్ కాగా, రజినీకాంత్ కుమార్తె ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ‘ కొచ్చాడియన్’’ సినిమా కోసం 2014లో మీడియా వన్ సంస్థకు యాడ్ బ్యూరో రూ.10కోట్లు అప్పుగా ఇచ్చింది. రూ.150కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి ప్రీప్రొడక్షన్ సమయంలో నిధుల కొరత ఏర్పడింది. దీంతో యాడ్ బ్యోరో సంస్థ రూ.10కోట్లు నిధులను సమకూరూస్తూనే తమిళనాడు హక్కులను తమకే కేటాయించాలనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే అనంతరం ‘కొచ్చాడియన్’ తమిళనాడు హక్కులను రెట్టింపు ధరకు ఇతరులకు అమ్మేసింది మీడియా వన్ సంస్థ. దీంతో యాడ్ బ్యూరో సంస్థ యజమాని అభినవ్ చంద్ నహార్ కోర్టులో కేసు వేశారు. తనకు రావాల్సిన మొత్తాన్ని కూడా మీడియా వన్ తిరిగి ఇవ్వలేదని, ఇంకా రూ.6.20కోట్లు రావాల్సివుందని పిటీషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని మీడియా వన్ సంస్థను ఆదేశించింది.
తీసుకున్నది తిరిగివ్వాల్సిందే.. రజినీకాంత్ భార్యకు సుప్రీం ఆదేశం
- Advertisement -
- Advertisement -