Monday, November 4, 2024

నాగాలాండ్ లోకాయుక్త పనితీరుపై సుప్రీం విస్మయం

- Advertisement -
- Advertisement -

Supreme court awe over Nagaland Lokayukta performance

 

న్యూఢిల్లీ : నాగాలాండ్ లోకాయుక్త ఢిల్లీలో కూర్చుని ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ విధులను ఏ విధంగా నిర్వర్తిస్తారు ? అని సుప్రీం కోర్టు ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. నాగాలాండ్ రాష్ట్రం తరఫున న్యాయవాది సుప్రీం దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలో ధర్మాసనానికి నాగాలాండ్ ప్రభుత్వ న్యాయవాది లోకాయుక్త రాష్ట్రంలో సరిగ్గా విధులు నిర్వహించడం లేదని ఫిర్యాదు చేశారు. లోకాయుక్త తరఫున న్యాయవాది వికాస్ సింగ్ ఆ రాష్ట్రం లోకాయుక్తను తొలగించాలనుకుంటున్నదని, కానీ లోకాయుక్తను తొలగించాలంటే ఒక విధానం ఉందని పేర్కొన్నారు. దీనికి సుప్రీం అంగీకరించలేదు. వచ్చే వారం దీనిపై విచారణకు సుప్రీం నిర్ణయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News