Tuesday, March 19, 2024

దిశ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Center and the states have equal powers

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో దోషులెవరు అనేది కమిషన్ గుర్తించింది. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఈ సందర్భంగా కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చెప్పారు. నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు.

సీనియర్లతో కూడిన కమిటీకి నివేదిక అందజేయాలని ఆయన తెలిపారు. ఈ క్రమంలో నివేదికను బహిర్గతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. నివేదిక బయటకు వస్తే సమాజంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని అ‍త్యున‍్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు విచారణలో భాగంగా విసి సజ్జనార్‌ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కాగా  నివేదిక కాపీలను ఇరు పక్షాలకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News