Home జాతీయ వార్తలు గ్యాంగ్ రేప్ బాధితురాలి పిల్లలకు ఉచిత విద్య అందించాలి

గ్యాంగ్ రేప్ బాధితురాలి పిల్లలకు ఉచిత విద్య అందించాలి

Supreme court directs free education to minor children of rape victim

 

జార్ఖండ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : గ్యాంగ్ రేప్‌నకు గురైన ఓ మహిళ మైనర్ చిన్నారులకు ఉచిత విద్య అందించాల్సిందిగా జార్ఖండ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2002, జూన్ 8న ఓ గిరిజన మహిళపై జార్ఖండ్‌లోని డాల్టన్‌గంజ్‌లో నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సంఘటనకు ముందు ఆమె తన భర్తతో పలు ఇబ్బందులనెదుర్కొని విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో, ఆమె మానసికంగా కృంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆమె రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆమెకు ఇప్పటికే పరిహారం అందించారు. తాజాగా బుధవారం ఇచ్చిన ఆదేశాలమేరకు ఆమెకు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ఓ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఆమె పిల్లలు 14 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత విద్య అందించాలి. బాధిత మహిళ సామాజిక వివక్షను కూడా ఎదుర్కొన్నారని జస్టిస్ అశోక్‌భూషణ్, ఆర్.సుభాష్‌రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.