న్యూఢిల్లీ: రిపబ్లిక్ టివి ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు పొడిగించింది. గోస్వామి తాత్కాలిక బెయిల్ ను పొడిగిస్తున్నట్టు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ… ఆత్మహత్య చేసుకునే విధంగా గోస్వామి ప్రేరేపించినట్టు చెప్పలేమన్నారు. గోస్వామిపై ఉన్న ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని తెలిపారు. తన అధికారాన్ని ఉపయోగించడంలో బాంబే హైకోర్టు విఫలమైందని ఆయన పేర్కొన్నారు. వేదింపులకు చట్టాలు ఆయుధాలు కాకూడదని హితువు పలికారు. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని గుర్తుచేశారు. పౌర వ్యక్తిగత స్వేచ్చ హరించడం తీవ్రమైన విషయని చెప్పారు. ఆర్కిటెక్ట్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారనే ఆరోపణలతో గోస్వామి అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది.