Home జాతీయ వార్తలు మహారాష్ట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

మహారాష్ట్ర వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme courtఢిల్లీ : మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో ఆదివారం విచారణ ప్రారంభమైంది. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. బిజెపి  తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్  తమ వాదనలు వినిపిస్తున్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఆదివారమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఎల కొనుగోళ్లకు అవకాశం లేకుండా తక్షణమే బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని, తమకు 144 మంది ఎంఎల్ఎల మద్ధతు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు తమను గవర్నర్ ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలని శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ లు సుప్రీంను తమ పిటిషన్ లో కోరాయి.

Supreme Court Hearing On Maharashtra Issue