Friday, March 29, 2024

అద్భుతం.. అద్వితీయం

- Advertisement -
- Advertisement -

నవ యాదాద్రిని సందర్శించి కట్టడాలను పరిశీలించిన సిజె ఎన్‌వి రమణ
సిజె దంపతులకు పూర్ణకుంభంతో అపూర్వ స్వాగతం
పూజలు నిర్వహించిన రమణ దంపతులు

మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులు రాబోయే రోజులలో భక్తితత్వం పెంపొందించే దిశగా నిర్మాణాలు జరిగాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ మంగళవారం సందర్శించారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారి యాదాద్రి క్షేత్రానికి జస్టీస్ దంపతులు రావడంతో ఆలయ సాంప్రదాయబద్ధంగా పూజారులు స్వర్ణ కలుశంతో కూడిన పూర్ణకుంభ స్వాగతంతో బాలాలయంలోకి స్వాగతించారు. బాలాలయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ గడప బయటి నుండే జస్టీస్ దంపతులు పంచా నారసింహుని దర్శించుకొని స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు. స్వామి వారిని దర్శించుకున్న జస్టీస్ దంపతులకు బాలాలయంలో పండితులు, అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందచేశారు.

ఈ సందర్భంగా ఆలయ విశేషాలను అర్చకులను అడిగి ఆయన తెలుసుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ పక్షాన స్వామి అమ్మవార్ల మెమోంటోను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అందచేశారు. పట్టు వస్త్రాలను దేవాలయ ఈవో గీతా, స్వామి వారి ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి న్యాయమూర్తి దంపతులకు అందచేశారు. అనంతరం పునర్ నిర్మాణమవుతున్న యాదాద్రి ఆలయ అభివృధ్ధి పనులను సుమారు గంట సేపు పరిశీలించారు. గర్భాలయం, ఆలయ ప్రకారాన్ని పరిశీలించి కట్టడాలను తీర్చిదిద్దిన వారిని ప్రశంసించారు. ప్రధానాలయంలోని స్వయంభు నారసింహుడిని జస్టీస్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణంలో ఏర్పాటు చేసిన శిల్పాలతో పాటు లైటింగ్ తీరు తెన్నెలను పరిశీలించిన ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయిని మెచ్చుకున్నారు.

అనంతరం ప్రెసిడెన్స్ షూట్, పెద్దగుట్టపై నిర్మాణమవుతున్న పెద్దగుట్ట టెంపుల్ సిటీని సందర్శించి యాత్రికులకు, వీవీఐపీల బస కోసం నిర్మాణమవుతున్న కాటేజీలను పరిశీలించి పనితీరును మెచ్చుకున్నారు. క్షేత్రంలో పచ్చదనం పోషణ హర్షనీయమని ఆలయ భక్తుడికి…..దేవుడి దర్శనానికి ప్రాప్తిస్థాయని అన్నారు. యాదాద్రి క్షేత్రంతో పాటు అభివృధ్ధి పనులు, కట్టడాలు అబ్బురంగా…..అద్వితీయంగా ఉన్నాయని శిల్పుల పనితీరును న్యాయమూర్తి ప్రశంసించారు. అనాతి కాలంలోనే పూర్తిస్థాయిలో కృష్ణ శిలతో రూపొందించడం మెచ్చుకోదగ్గ విషయమాన్ని న్యాయమూర్తి అన్నారు. దర్శన అనంతరం అతిథి గృహానికి చేరుకున్న న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా నిర్మాణం చేపడుతుందని సందర్శకుల పుస్తకంనందు లిఖిత పూర్వకంగా వ్రాశారు. ఉదయం 8 ః 35 నిమిషాలకు యాదాద్రికి చేరుకున్న జస్టీస్ గంట సేపు ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు రెండు గంటల సేపు ఆలయ పునర్ నిర్మాణ అభివృధ్ధి పనులను పరిశీలన చేసిన ఆయన తిరిగి హైద్రాబాద్‌కు బయల్దేరారు. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న న్యాయమూర్తికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జగదీదశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ పోలిసు కమీషనర్ మహేశ్‌భగవత్, డీసీపీ నారాయణరెడ్డి, నల్లగొండ జిల్లా స్పెషల్ జడ్జీ తదితరులు పాల్గొని న్యాయమూర్తికి ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News