Home జాతీయ వార్తలు సుప్రీం ఆదేశాలను పాటిస్తున్నాం: సిద్ధరామయ్య

సుప్రీం ఆదేశాలను పాటిస్తున్నాం: సిద్ధరామయ్య

Siddaramaiahబెంగళూరు: కావేరి జలాల విషయంలో కర్నాటకకు ఏళ్లుగా అన్యాయం జరగుతోందని కర్నాటక సిఎం సిద్ధ రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని, సుప్రీం ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.