Home తాజా వార్తలు అజారుద్దీన్‌కు షాక్

అజారుద్దీన్‌కు షాక్

Supreme court rejects mohammad azharuddin plea

 

హెచ్‌సిఎ అధ్యక్షుడికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సిందేనని అత్యుత్తమ న్యాయ స్థానం అజారుద్దీన్‌కు స్పష్టం చేసింది. కొంత కాలంగా క్రితం అజారుద్దీన్ ను హెచ్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ అపెక్స్ కౌన్సి ల్ నిర్ణయం తీసుకుంది. అయితే అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయంపై అంబుడ్స్‌మెన్ దీపక్ వర్మతో కలిసి అజారుద్దీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పరస్ప ర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండడం, హెచ్‌సిఎ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో అపెక్స్ కౌన్సిల్ అజారుద్దీన్‌కు ఆదేశాలు జారీ చేసిం ది. కాగా హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఉన్న తనకు అపెక్స్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై అజారుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

తనకు నోటీసులు ఇచ్చే హక్కు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేదని మీడియా వేదికగా విమర్శలు గుప్పించాడు. అంతేగాక కౌన్సిల్‌లో మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించాడు. మరోవైపు లోధా సిఫార్సులకు లోబడే తాము నోటీసులు ఇచ్చామని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో అజారుద్దీన్ ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాడు. కానీ సుప్రీం కోర్టులో అజారుద్దీన్‌కు ఊహించని షాక్ తగిలింది. అజారుద్దీన్‌ను హెచ్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో అజారుద్దీన్ హెచ్‌సిఎ అధ్యక్ష పదవి నుంచి వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అజారుద్దీన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Supreme court rejects mohammad azharuddin plea