Home జాతీయ వార్తలు రోడ్డుపై ఉమ్మి వేసినందుకు గుంజీలు…. (వీడియో వైరల్)

రోడ్డుపై ఉమ్మి వేసినందుకు గుంజీలు…. (వీడియో వైరల్)

Surat Man squats

 

గుజరాత్‌: బహిరంగ ప్రదేశంలో ఉమ్మి వేసినందుకు ఒక యువకుడిని సూరత్ మున్సిపాల్టీ ఆరోగ్య శాఖ అధికారులు శిక్షించారు. సూరత్ మునిసిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసి) పరిశుభ్రత పట్ల కఠినమైన కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా రోడ్డుపై ఉమ్మి వేస్తే జరిమానా వేస్తున్నారు. అయితే, కొన్ని నెలల కిందట సూరత్‌లోని లాల్ బంగ్లా సమీపంలో ఓ యువకుడు మోటర్ సైకిల్ నడుపుతూ రోడ్డుపై ఉమ్మి వేసి వెళ్లిపోయాడు. తాజాగా అతన్ని పట్టుకున్న అధికారులు జరిమానా వేశారు. అయితే, జరిమానా చెల్లించడానికి తన వద్ద తగినంత డబ్బు లేదని, అందువల్ల తాను జరిమానా చెల్లించలేనన్నాడు. దీంతో అధికారులు, అతనితో గుంజీళ్లు తీయించి…సారీ కూడా చెప్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Surat Man squats no money to pay fine for spitting