Friday, April 26, 2024

భారీ చేజింగ్ సీన్..

- Advertisement -
- Advertisement -

Surender reddy plans to long Action scene for Agent

అక్కినేని అఖిల్ ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ కోసం గతంలో ఎన్నడూ లేనంతగా అఖిల్ ఊర మాస్ లుక్‌తో మైమరపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ కోసం సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో అఖిల్ కోసం ఏకంగా 15 నిమిషాల పాటు ఓ భారీ చేజింగ్ సీన్‌ని సురేందర్ రెడ్డి ప్లాన్ చేసినట్టు తెలిసింది. కాగా ఈ సీన్ కోసమే చిత్ర బృందం విదేశాలకు వెళ్ళనుందని.. అక్కడ అయితేనే ఇలాంటి సీన్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. ఈ సీన్‌ను హాలీవుడ్ టెక్నీషియన్ల సాయంతో చిత్రీకరిస్తారని సమాచారం.

Surender reddy plans to long Action scene for Agent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News