Home అంతర్జాతీయ వార్తలు షార్క్ దాడిలో సర్ఫర్ మృతి

షార్క్ దాడిలో సర్ఫర్ మృతి

Surfer died in shark attack in Australiaఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని కింగ్స్‌క్లిఫ్ బీచ్‌లో షార్ఫ్ దాడి చేయడంతో ఓ సర్ఫర్ చనిపోయాడు. వివరాలు ఉన్నాయి. క్విన్స్‌ల్యాండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి (60) సర్ఫింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మూడు మీటర్ల పొడవు ఉన్న ఓ షార్క్ దాడి చేసింది. ఈ దాడిలో సదరు వ్యక్తి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. షార్క్ దాడిని గమనించిన బోటు రైడర్లు బాధితుడిని ఒడ్డుకు చేర్పి ప్రాథమిక చికిత్స చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనాస్థలిలోనే సదరు వ్యక్తి చనిపోయాడు. మృతుడి వ్యక్తిగత వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా షార్క్ దాడి ఘటనలు ఆస్ట్రేలియాలోనే అధికంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన షార్క్‌ల దాడుల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. గత ఏడాదిలో 27 షార్క్ దాడి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.