Home తాజా వార్తలు లీకేజీలు లేవు

లీకేజీలు లేవు

Surge Poolసర్జ్‌పూల్‌ను శోధించిన గజ ఈతగాళ్లు

మన తెలంగాణ/ధర్మారం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సర్జిపూల్‌ను విశాఖపట్నంకు చెందిన గజ ఈతగాళ్ల బృందం శనివారం పరిశీలించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీరు వేమునూరు జీరో పాయింట్ ద్వారా అప్రోచ్ కెనాల్ సహాయంతో టన్నెళ్ల నుండి మేడారం సరిపూల్‌కు శుక్రవారంరాత్రి వరకు 124.5 సెం.మీ చేరుకున్న విషయం విధితమే. శుక్రవారం అర్థరాత్రి గేట్లు మూసివేసిన అధికారుల బృందం శనివారం సర్జిపూల్‌లోని మెయి న్ గేట్లతోపాటు టన్నెళ్ల పరిస్థితిని గజ ఈతగాళ్ల ద్వారా పూర్తిస్థాయిలో పరిశీలించారు.

ఎలాంటి లీకేజీలు లేకపోవడంతోపాటు సర్జిపూల్ నీటిమట్టం పెరిగినప్పటికీ ఇబ్బందులు ఉండవని గుర్తించిన ప్రత్యేక అధికారుల బృందం నేటి నుండి సర్జిపూల్‌ను నింపాలని నిర్ణయించారు. కాళేశ్వరం టెక్నికల్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ఇంజనీరింగ్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, ఏఈ ఉపేందర్, డీజీఎం శ్రీనివాసరావు, డీపీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం సర్జిపూల్‌తోపాటు పంప్‌హౌస్, జీఐఎస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేటి నుండి పూర్తిస్థాయిలో నీటిని నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 24న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 6వ ప్యాకేజీలో వెట్న్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

ఈ వెట్న్‌క్రు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. 24న సీఎం కేసీఆర్ మేడారం చేరుకొని వెట్న్‌న్రు స్వయంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఇంజనీరింగ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. సీఎం రాకకు మరో నాలుగు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇటు ఇంజనీరింగ్ అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు, ఏజెన్సీ బృందాలు యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వెట్న్ ఈ నెల 24న ప్రారంభమయ్యే అవకాశాలుండగా, ప్రపంచంలోనే నంబర్‌వన్ గా నిలిచిన భూగర్భ సర్జిపూల్ అందుబాటులోకి రానుంది.

Surge Pool Works at Kaleshwaram Project