Saturday, April 20, 2024

పంది కిడ్నీ ఓ మహిళకు అమరిక

- Advertisement -
- Advertisement -

Surgeons attached Pig Kidney to human

అమెరికా డాక్టర్ల ఆపరేషన్ సక్సెస్

న్యూయార్క్ : అమెరికాలో డాక్టర్ల బృందం వైద్య శాస్త్రంలో అరుదైన విజయం సాధించారు. ఓ పంది కిడ్నీని ఓ మహిళారోగికి విజయవంతంగా శస్త్రచికిత్స ద్వారా తాత్కాలిక ఏర్పాటుగా అమర్చారు. స్థానిక ఎన్‌వైయు లాంగోన్ హెల్త్ కేంద్రంలో ఈ మానవాళి హిత శస్త్రచికిత్స జరిగింది. జంతువుల నుంచి మనుష్యులకు ప్రధాన అవయవాల మార్పిడి ఘట్టంలో ఇప్పటి ఆపరేషన్ అంకం కీలకమవుతోందని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో మరో కీలక అంశం కూడా ఉంది. పంది కిడ్నీ పొందిన మహిళ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌తో అచేతనావస్థలో ఉంది. కిడ్నీలు పనిచేయడం లేదు. దీనితో చావుకు సమీపిస్తున్న దశలో డాక్టర్ల బృందం కిడ్నీ మార్పిడి నిర్ణయం తీసుకుంది. మహిళకు వెంటిలేటర్ల ద్వారా శ్వాస కల్పిస్తూ పంది కిడ్నీ మార్పిడికి పాల్పడ్డారు. ముందుగా కుటుంబ సభ్యుల అనుమతి పొందారు.

పంది కణాలలోని గ్లైకాన్ కణాలలో ఉండే షుగర్ కణాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇటువంటి కణాలు ఉంటే మనిషికి ఈ కిడ్నీని అమర్చడం వల్ల విపరీత పరిణామాలు తలెత్తుతాయి. అయితే దీనిని ముందుగానే గమనించి డాక్టర్ల బృందం పందిలోని జన్యుకణాలను మార్చేవారు. తరువాతి క్రమంలో ఈ వరాహాపు కిడ్నీని తొలుత రోగి శరీరం వెలుపల రక్తనాళాలకు అమర్చారు. మూడురోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ కిడ్నీని రోగి శరీరం తిరస్కరించలేదని, అంతా సవ్యంగా ఉందని గుర్తించారు. ఈ మహిళ అంతర్గత రోగనిరోధక శక్తికి ఎటువంటి ఢోకా లేదని గ్రహించారు. అంతేకాకుండా అప్పటివరకూ ఈ రోగిలో ఉన్న దయనీయ స్థాయి కిడ్నీల పనితీరు సాధారణ స్థితికి చేరిన విషయాన్నిగుర్తించారు.

రోగి కిడ్నీలు సరైన రీతిలో ఫిల్టర్ అవుతూ మామూలుగానే మూత్ర విసర్జన జరుగుతూ ఉండటాన్ని కీలక పరిణామంగా నిర్థారించారు. ఈ డాక్టర్ల బృందంలో అవయవాల మార్పిడి సర్జను రాబర్ట్ మోంట్గోమెరి ఇతరుల వైద్య నిపుణుల బృందం చురుగ్గా పాల్గొంది. పూర్తిగా మరణశయ్యపై ఉన్న రోగులలో కూడా ఈ కిడ్నీ మార్పిడి విజయవంతం కావడం, తాత్కాలికంగా అయినా సాధారణ స్థాయికి మూత్రకోశ వ్యవస్థ చేరడంతో ఇదో అత్యద్భుత ఘట్టం అయింది. ఇకపై జంతువుల ప్రధాన అవయవాలను మనిషికి అమర్చి జీవిత దానానికి మార్గాలు వేయడానికి ఇదో అపూర్వ ఆపరేషన్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News