Home జాతీయ వార్తలు ఆవు పొట్టలో 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు

ఆవు పొట్టలో 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు

cow

చెన్నై: తమిళనాడు వెటర్నరీ అండ్ ఏనిమల్ సైన్సెస్ యూనివర్శిటీ వైద్యులు ఓ ఆవు కడుపులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను తొలగించారు. కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉన్న ఆవు పొట్టలో వ్యర్థాలు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. అనంతరం దాదాపు ఐదున్నర గంటల పాటు శ్రమించి ఆవు శరీరంలో నుంచి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించామని డాక్టర్ వెల్వన్ వెల్లడించారు. ఇందులో రెండు స్క్రూలు, ఒక కాయిన్ కూడా ఉన్నాయని సర్జన్లు తెలిపారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్య పరిస్తితి నిలకడగా ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్లు తెలిపారు.

 

surgeons remove 52 kg of plastic from cow stomach

surgeons remove 52 kg of plastic from cow stomach