Home అంతర్జాతీయ వార్తలు సింగపూర్‌లో ట్రంప్‌కు సర్‌ప్రైజ్‌..

సింగపూర్‌లో ట్రంప్‌కు సర్‌ప్రైజ్‌..

tump

సింగపూర్‌: సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఆ దేశ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ట్రంప్‌ పుట్టినరోజుకు మరో మూడు రోజులు ఉండగానే లూంగ్‌‌ ముందస్తు బర్త్‌డే వేడుకలు చేశారు. ట్రంప్ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను కట్‌ చేయించి ప్రత్యేక విందును ఇచ్చారు.  దీనికి సంబంధించిన ఫొటోను సింగపూర్‌ విదేశాంగశాఖ మంత్రి ట్విటర్‌ ద్వారా పోస్టు చేశారు.లూంగ్‌ సర్‌ప్రైజ్‌కు ట్రంప్‌ ముగ్ధుడయ్యా రు.లూంగ్‌ ఆతిథ్యం చాలా చక్కగా ఉందని ట్రంప్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భం గా ఆయనకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. జూన్‌ 14న ట్రంప్‌ తన 72వ పుట్టినరోజును జరుపుకోనున్నారు.