Home తాజా వార్తలు కనువిందు చేస్తున్న ట్యాంక్‌బండ్

కనువిందు చేస్తున్న ట్యాంక్‌బండ్

Surrounding areas of Tank‌band are more entertaining

పిల్లలు, పెద్దలు ఆకర్శితులవుతున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు ఆదివారాలుగా సందర్శకులను కనువిందు చేస్తున్న ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు హెచ్‌ఎండిఏ చర్యలు చేపట్టింది. రెండు వారాలుగా ఈ విధానం విజయవంతం కావడంతో పర్యాటకులకు మరింత అనుభూతిని కలిగించేలా ఈ ఆదివారం ఆర్మీ బృందం ప్రదర్శించిన బ్యాండ్ ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ పరిసరాలను తిలకించడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఇలా ప్రతి ఒక్కరి మనస్సును ఆహ్లాదపరిచేలా, ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్ ఉందని పిల్లలు, పెద్దలు ఈ పరిసరాల పట్ల ఆకర్శితులవుతున్నారని హెచ్‌ఎండిఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు.