Home తాజా వార్తలు రోహింగ్యాల కదలికలపై నిఘా

రోహింగ్యాల కదలికలపై నిఘా

Rohingya Muslims

మన తెలంగాణ/హైదరాబాద్ : రోహింగ్యా ముస్లిం తెగకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ముందస్తు హెచ్చరికల కారణంగా రాష్ట్రంలో తలదాచుకుంటున్న రోహింగ్యాల కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. మయన్మార్ దేశం నుంచి తరమేయబడిన రోహింగ్యా ముస్లిం తెగలతో దేశానికి ముప్పు పొంచిఉందని, వారిని ఎప్పుడైన ఇస్లామిక్ స్టేట్ వాడుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఆ హెచ్చరికలలో పేర్కొన్నాయి. ముఖ్యంగా రోహింగ్యా ముస్లిం తెగకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు మరోసారి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు, వీరికి ఇస్లామిక్ స్టేటతో సంబంధాలున్న రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, మేవాట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది శరణార్థులుగా ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక మేరకు రాష్ట్ర పోలీసులు వారి కదిలికలపై దృష్టి సారించనున్నారు

. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 నుంచి 7 వేల మంది రోహింగ్యాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరికి ప్రభుత్వం నుంచి ఏలాంటి సహాయ సహకారాలు, పథకాలు అందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు స్థానిక పోలీసలుఉ కసరత్తు ప్రారంభించారు. ముఖ్యంగా రోహింగ్యాల వేలి ముద్రలు, ఐరిస్ తదితర ఆధారాలు సేకరించి వారిపై నిఘా సారించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించనున్నారు. బాలపూర్ మత్తు మాత్రలు విక్రయిస్తుండగా ఇద్దరు రోహింగ్యాలు అరెస్టు కావడంతో పోలీసులు అప్రమత్తమై ఆయా ప్రాంతాలలో ఉన్న రోహింగ్యాలపై దృష్టిసారించారు. పోలీసుల దర్యాప్తులో మేడ్చల్ నియోజక వర్గ పరిధిలో వందలాది మంది రోహింగ్యాలు ఓటుహక్కు కలిగి ఉన్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఖ్యంగా రాచకొండ పరిధిలో ఉన్న రోహింగ్యా ముస్లిం తెగల వారు స్థానికులతో పరిచయాలు పెంచుకుని జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా మయన్మార్ దేశస్తులకు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు పొందిన వారిపై నిఘా సారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కొందరు స్థానికులు, బ్రోకర్లు కేవలం దబ్బులకు ఆశపడి రోహింగ్యాలకు ప్రభుత్వ రేషన్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. బాలాపూర్ పరిధిలో వేలాది మంది రోహింగ్యాలు శరణార్డులుగా ఉంటున్నారని, రోహింగ్యాలకు భారతపౌరసత్వం పొందే అర్హత లేదని, కొందరు రోహింగ్యాలు ధృపత్రాలు పొందేందుకు యత్నిస్తున్నారని, వారికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెబుతున్నారు. మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్ రోంహిగ్యా ముస్లింలు పాస్‌పోర్టులు పొందేందుకు పాస్‌పోర్ట్ ఎజెంట్‌గా పనిచేస్తున్న బాలాపూర్ నివాసి నయీంను సంప్రదిండంతో రోహింగ్యాలకు ఇంటి అద్దె అగ్రిమెంట్లు తయారు చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డులు నయీం ఇప్పించడంతో పాటు వారికి భారత పాస్‌పోర్టులు ఇప్పించాడని తేలడంతో మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్‌లతో పాటు పాస్‌పోర్ట్ ఎజెంట్ సయ్యద్ నయీంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు, వీరికి ఇస్లామిక్ స్టేటతో సంబంధాలున్న రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, మేవాట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది శరణార్థులుగా ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక మేరకు రాష్ట్ర పోలీసులు వారి కదిలికలపై దృష్టి సారించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోహింగ్యాలున్నల్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని రోహింగ్యాలను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. నగరంలో నిర్వహించే కార్డన్ సర్చ్‌లలో రోహింగ్యాల వివరాలు, ఆధారాలు సేకరించి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని పోలీసు బాసులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు, వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు.

Surveillance on Rohingya movement