Thursday, July 17, 2025

‘ఫీనిక్స్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి (Surya Sethupathi) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఫీనిక్స్. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. జూలై 4, 2025న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీ( perfect launching movie)గా ఉండబోతోంది. ఇది సూర్య సేతుపతి పూర్తి స్థాయిలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం కాగా, గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ వంటి చిత్రాల్లో స్మాల్ రోల్స్‌లో కనిపించాడు.

ఫీనిక్స్‌తో హీరోగా డెబ్యు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన రెండవ సింగిల్ ఇంధ వంగికో, సామ్ సిఎస్ స్వరపరిచిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాబా భాస్కర్ కోరియోగ్రఫీ, వెల్‌రాజ్ అందించిన కలర్ ఫుల్ విజువల్స్, సూర్య సేతుపతి ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో పాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ సేతుపతి స్వయంగా ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News