Home తాజా వార్తలు ‘నాకు ఇన్ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. వెధవ’

‘నాకు ఇన్ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. వెధవ’

 

‘నాకు ఇన్ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. వెధవ’ అంటూ మండిపడుతుంది మెగా డాటర్ కొణెదల నిహారిక. రాహుల్ విజ‌య్, నిహారిక జంట‌గా నటించిన సినిమా ‘సూర్యకాంతం’. ఈ చిత్రంలో నిహారిక టైటిల్‌ రోల్‌లో నటిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ఆడియోను విడుదల చేసిన చిత్రయూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘నా పేరు అభి.. నా జీవితంలో ఓ సంఘటన జరిగింది..’ అంటూ వచ్చే హీరో డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ఆరంభమైంది. ‘నాకు ఇన్ డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. వెధవ’ అంటూ నిహారిక.. హీరో విజయ్‌కి చుక్కలు చూపిస్తుంది. మరోపక్క సాఫ్ట్‌ గర్ల్‌‌గా బిసానియా గ్లామరస్‌ లుక్‌తో ఆకట్టుకుంది. ఇద్దరి భామల ప్రేమలో నలిగిపోయే అమాయకపు యువకుడిగా రాహుల్ విజయ్ నటించారు. ట్రైలర్‌ను చూస్తుంటే..ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. లవ్, ఎమెషన్స్, ఫన్, సెంటిమెంట్ మేళవింపుతో రూపొందిన ‘సూర్యకాంతం’ హిట్ కొట్టేట్టుగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి మార్క్‌ కె రాబిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Suryakantham movie Trailer release