Thursday, April 25, 2024

ఫీల్ గుడ్ ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

Sushanth reddy directed dear megha film

ఎన్నో ప్రేమ కథలు తెరపైకి వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథ ‘డియర్ మేఘ’ అంటున్నారు చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్లుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అర్జున్ దాస్యన్ నిర్మాత. ‘డియర్ మేఘ’ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. మేఘా ఆకాష్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘డియర్ మేఘ’ ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ప్రేమ కథ అని టీజర్‌తో తెలిసిపోయింది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ “కథ బాగా నచ్చి మూవీ చేశాం. మా చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం”అని అన్నారు. దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ “కొన్ని ప్రేమ కథల్ని మనం థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని లవ్ స్టోరీలు మాత్రం మన మనసులో నాటుకుపోతాయి. హృదయంలో అలాగే నిలిచి ఉంటాయి. అలాంటి సినిమానే ‘డియర్ మేఘ’. ఈ సినిమా ప్రేక్షకుల హార్ట్‌ను టచ్ చేస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు హరి గౌర, హీరో అరుణ్ ఆదిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News