Home Breaking News సుష్మాస్వరాజ్‌ కన్నుమూత

సుష్మాస్వరాజ్‌ కన్నుమూత

Sushma Swaraj

 

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ ఎయిమ్స్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా సుష్మా స్వరాజ్ విశేష అభిమానులను కలిగి ఉన్నారు. ఆమె చివరిసారిగా కశ్మీర్ విభజనపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇటువంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Sushma Swaraj passed away