Saturday, April 20, 2024

శారదక్క లొంగుబాటులో ఉత్కంఠ..?

- Advertisement -
- Advertisement -

Suspense on Maoist Sharadakka Surrender!

హైదరాబాద్: ప్రజా సమస్యల కోసం ఉదమ్య బాట పట్టిన హరిబూషన్ సంచాలనాలకు కేంద్రం బింధువై తన దైన శైలిలో ఉద్యమాలను బలోపేతం చేసిన నాయకుడి భార్య జెజ్జరి సమ్మక్క అలియాస్ శారద అక్క కరోనా సోకి అనారోగ్యంతో లొంగిపోయినట్లు ప్రచారం జరగడం సంచలనమైంది. ఈ క్రమంలో రాష్ట్ర డీజీపీ ఎదుట ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లొంగిపోయినట్లు జరిగిన సంఘటన దావణంలా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఈ విషయం తెలియడంతో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పరిధిలోని కుటుంబ సభ్యులు తల్లి, మేనళ్లుడు అనందపడ్డారు. అయితే, వారం రోజులు గడుస్తున్నప్పటికీ లొంగుబాటును పోలీసులు దృవీకరించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శారదక్క లొంగుబాటు విషయంపై మావోయిస్టు హైకమాండ్ మౌనం వెనుక అంతర్యమేమిటని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో శబరి ఏరియా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమెకు మరో కీలకమైన అధనపు బాధ్యతలు అప్పగించగా, తనదైన శైలిలో పనిచేసినట్లు తెలిసింది.

మహారాష్ట్రంలోని సిరవంచ ఏరియాలో సిద్దబోయిన సారక్క, అలియాస్ భారతక్క రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఇటీవల కరోనా సోకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చతీష్ ఘడ్ దండకారణ్యానికి తూర్పు దిశగా ఉన్న శబరి ఏరియాలో ఉన్న మరో మహిళా చిచ్చరపిడుగైన శారదక్కను నియమించారు. ఈ క్రమంలో పోలీసులు ఎదుట లొంగిపోయి కుటుంబ సభ్యుల చెంతకు చేరాలనే ధృడమైన నిశ్చయంతో లొంగిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో లొంగిపోయి వారం రోజులు గడుస్తున్నా లొంగుబాటును పోలీసులు ధృవీకరించకోపవడంలో లొంగిపోయిందా?, చికిత్స పొందుతుందా అనే విషయం తెలియకుండా పోయింది.

Suspense on Maoist Sharadakka Surrender!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News