*జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు
మనతెలంగాణ/ ఇందూరు: స్వచ్ఛ నిజామాబాద్‌గా ఎదిగేం దుకు నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో తప్పని సరిగా భాగ స్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఇటీవల నిజామాబాద్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించు కున్నామని ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రజల సహకా రం అవసరమని అన్నారు. గడువు పూర్తి అవుతుందని ప్రజ లు అధిక సంఖ్యలో పాల్గొని తమ అమూల్యమైన సానుకూల అభిప్రాయాలను తెలపాలన్నారు. దీని కోసం ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని శుభ్రతపై రోజువారి తమ అభిప్రాయాలను తెలపాలన్నారు. దాంతో పాటుగా టోల్ ఫ్రీ 1969 నంబర్‌కు ఫోన్ చేసి తిరిగి వారు అడిగిన ప్రశ్నలకు అనుకూల సమాధానాలు ఇచ్చిన పక్షంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో ర్యాంకు పెరుగుతుందన్నారు. అం తే కాకుండా తమ అభిప్రాయాలను వెబ్‌సైట్ ద్వారా కూడా సానుకూల అభిప్రాయాలను తెలుపవచ్చునన్నారు. ప్రజలు పెద్ద మొత్తంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ నగర ప్రజలను కోరారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా అధి కారులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపార వేత్తలు, వా రి కుటుంబ సభ్యులు యువత విద్యార్థులు స్వచ్చంధ సం స్థలు, యువజన సంఘాలు, స్వయంశక్తి సంఘాలు చురు కుగా పాల్గొనాలని నిజామాబాద్ నగరాన్ని అత్యుత్తమ స్థా నంలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.