Saturday, April 20, 2024

అచ్యుతానందగిరి స్వామిని హత్య చేసి శిష్యురాలిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

Swamy murder and rape on follower in Chittoor

అమరావతి: శ్రీరామతీర్థ సేవాశ్రమ నిర్వాహకుడు అచ్యుతానందగిరి స్వామి(60) హత్య చేసి ఆమె శిష్యురాలిపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్లపల్లె గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత 50 సంవత్సరాల క్రితం గుండ్లపల్లి గ్రామంలో శ్రీరామతీర్థ సేవాశ్రమాన్ని శాంతానందస్వామి స్థాపించాడు. శాంతానందం దగ్గర పూర్ణచంద్రారెడ్డి అనే వ్యక్తి శిష్యుడిగా చేరారు. పూర్ణచంద్రారెడ్డి అలియాస్ అచ్యుతానందగిరి స్వామిగా పేరు మార్చుకున్నారు. శాంతానంద స్వామి మరణించిన అనంతరం శ్రీరామతీర్థ సేవాశ్రమం నిర్వహణ బాధ్యతలు అచ్యుతానందగిరి చేపట్టారు. స్వామి దగ్గర 60 ఏళ్ల శిష్యురాలు ఉంటుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆశ్రమంలోకి చొరబడి అచ్యుతానందగిరి స్వామి గదిలోకి వెళ్లారు. గదిలో నుంచి శబ్ధం రావడంతో ఆమె గదిలో వెళ్లి చూడగా కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించాయి. అగంతకుడు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఆమె వారి నుంచి తప్పించుకొని తోటలోనికి పరుగులు తీసింది. అగంతుకులు స్వామిజీ గొంతు నులిమి హత్య చేసి పారిపోయారు. శిష్యురాలు రెడ్డెప్పరెడ్డి అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. రెడ్డెప్పరెడ్డి ఆశ్రమానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సిఐ లక్ష్మీ కాంతరెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి తన సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి జాగిలాలు పీలేరు వైపు వెళ్లడంతో పాటు ఘటనా స్థలానికి కొంచెం దూరంలో పర్సును పోలీసులు గుర్తించారు. పర్సులో ఉన్న ఫోటోలు, ఫోన్ నంబర్లు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News