ముగ్గురు మహిళా న్యాయమూర్తులు
సహా ఒకేసారి ఇంత మంది జడ్జీల
పదవి స్వీకారం అపూర్వఘట్టం
ఉదయం 10గంటలకు ప్రమాణ
స్వీకరాం చేయించనున్న సుప్రీం కోర్టు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
ఎన్‌వి.రమణ కొవిడ్ కారణంగా
ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహణ
మొదటి సారిగా ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు (మంగళవారం) అపూర్వ చారిత్రక ఘట్టం ఆవి ష్కృతం అవుతుంది. ఒక్కరోజే తొమ్మండుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ధర్మనిర్వర్తణ బాధ్యతలు తీసు కుంటారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఉదయం 10.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయిస్తా రు. వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. నవ నవ న్యాయమూర్తుల ప్రమాణస్వీకార ఘ ట్టం సుప్రీంకోర్టు అదనపు భవన ఆవరణంలోని ఆడిటో రియంలో జరుగుతుంది. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటి వరకూ ప్రధాన న్యాయమూర్తిణిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి స్థానం చేపడుతున్నారు. సాధారణంగా ఇప్పటివరకూ న్యాయమూర్తులతో సిజెఐ ప్రమాణస్వీకార కార్యక్రమా న్ని నిర్వహించడం సిజెఐ ప్రత్యేక కార్యాలయంలోనే జ రుగుతుంది. ఇందుకు భిన్నంగా కోవిడ్ కట్టుదిట్టమైన నిబంధనల పరిధిలో ఆడిటోరియంలో నిర్వహిస్తారు. ఇంతకు ముందెప్పుడూ సుప్రీం చరిత్రలో ఇంత మంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణస్వీకారం చేసిన దా ఖలాలు లేవు. ఇప్పుడు తొమ్మండుగురు జడ్జిల రాకతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సిజెఐ తో కలిపితే 33కు చేరుతుంది.
సుప్రీంకోర్టుకు ఉండాల్సి న న్యాయమూర్తుల సంఖ్య 34. ఒకేసారి తొమ్మండుగు రు జడ్జిల ప్రమాణం, వేదిక మార్పు ఈ రెండూ సరికొత్త అంశాలు అని సుప్రీంకోర్టు ప్రజా సంబంధాల కార్యాల యం వెలువరించిన ప్రకటనలో తెలిపారు. కార్యక్రమా న్ని డిడి న్యూస్, దూరదర్శన్ ఇండియాలలో ప్రత్యక్ష ప్ర సారం చేస్తారు. ఇది కూడా సరికొత్త అంశం అవుతోంది. ఇప్పుడు సుప్రీం జడ్జిలు కానున్న వారిలో జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జితేంద్ర కు మార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగర త్న, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ ఎంఎం సుంద్రేష్, జ స్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పిఎస్ నరసింహ ఉన్నారు. వీరిలో నరసింహ సీనియర్ న్యాయవాదిగా ఉంటూ గ తంలో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. సుప్రీం కోటా నుంచి నరసింహను ఎంపిక చే శారు. ఇక జస్టిస్ నాగరత్న 2027లో దేశానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే సీనియార్టీని సం తరించుకుని ఉన్నారు.