Home జాతీయ వార్తలు ఉద్యోగాల పేరుతో మోసం.. స్వీట్ షాపు మేనేజింగ్ డైరెక్టర్‌ అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం.. స్వీట్ షాపు మేనేజింగ్ డైరెక్టర్‌ అరెస్ట్

sweet shop MD in Coimbatore arrested

 

తమిళనాడు: మేనేజర్, అకౌంటెంట్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిస స్వీట్ షాపు మేనేజింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన కోయంబత్తూర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోయంబత్తూరులో పేరుగాంచిన ప్రముఖ స్వీట్ హౌజ్ ను నడిపిస్తున్న టిఎస్సార్ బాలచంద్రన్ తన షాపులో మేనేజర్, అకౌంటెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ఇచ్చారు. దీంతో ఉద్యోగం కోసం సుమారు 160 మంది దరఖాస్తు చేశారు. అయితే బాలచంద్రన్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.32 లక్షలు దండుకున్నారు. కానీ బాలచంద్రన్ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారిపై బెదిరింపులకు దిగడు. దీంతో బాధితులంతా తము మోసపోయామని గ్రహించి కోయంబత్రూర్ పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బాలచంద్రన్‌ను అరెస్ట్ చేసి, విచారిస్తున్నట్టు తెలిపారు.

sweet shop MD in Coimbatore arrested for alleged cheating