న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తాజాగా ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్వెస్కో నుంచి 700 మిలియన్ డాలర్లు (రూ.5,225 కోట్లు) నిధులను సమీకరించింది. ఈ నిధులను కీలక ప్లాట్ఫామ్ వృద్ధిని వేగవంతం చేసేందుకు, అలాగే కామర్స్ గ్రాసరీ సేవలు ఇన్స్టామార్ట్ను స్పీడప్ చేసేందుకు వినియోగించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త ఇన్వెస్టర్లలో బారన్ క్యాపిటల్ గ్రూప్, సుమెరు వెంచర్, ఐఐఎఫ్ఎల్ ఎఎంసి లేట్ స్టేజ్ టెక్ ఫండ్, కోటక్, యాక్సిస్ గ్రోత్ అవెన్యూస్, ఎఐఎఫ్ఐ, సిక్స్టీన్త్ స్ట్రీట్ క్యాపిటల్, ఘిసాలో, స్మైల్ గ్రూప్, సెగంటి క్యాపిటల్, స్విగ్గీ వంటివి ఉన్నాయి.
Swiggy doubles valuation to $700 million