Saturday, April 20, 2024

ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు స్వైన్‌ఫ్లూ

- Advertisement -
- Advertisement -

supreme-court

 

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక హెచ్1ఎన్1 (స్వైన్‌ఫ్లూ) వైరస్ సోకింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే మంగళవారం జడ్జిలతో వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు. వైరస్ నియంత్రణకు ముందు జాగ్రత్తగా న్యాయవాదులు, సిబ్బంది వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. అంతకు ముందు జస్టిస్ డివై చంద్రచూడ్ తన కోర్టు గదిలో న్యాయవాదులు వాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ఈమేరకు వ్యాక్సినేషన్ ఏర్పాట్లు చేయాలని చీఫ్ జస్టిస్ బోబ్డోకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ తరువాత సిజెఐ బార్ అసోసియేషన్ ఆఫీస్ సిబ్బందితో కూడా సమావేశమై వైరస్ వ్యాప్తిపై చర్చించారు.

ఈ కారణంగా సిజెఐ బోబ్డే ఆధ్వర్యాన ధర్మాసనం తన పని ప్రారంభించడంలో ఆలస్యమైంది. ధర్మాసనం ఉదయం 10.30 కు విధులు ప్రారంభించ వలసి ఉండగా, 11.08 కి ప్రారంభించింది. సుప్రీం కోర్టు నిర్వహణ యంత్రాంగం సంబంధిత ఆరోగ్య మంత్రి త్వశాఖ అధికారులతో వైరస్ నివారణకు తక్షణ చర్యలపై చర్చించింది. ఈ సందర్భంగా న్యాయవాదులు అందరికీ వైరస్ నియంత్రణ చికిత్స సమకూరేలా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సర్వీస్ సౌకర్యాన్ని తాత్కాలిక డిస్పెన్సరీని ఏర్పాటు చేసేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని ప్రధాన కార్యదర్శికి సిజెఐ సూచించారు.

సిజెఐ ఉదయం ఉదయం సమావేశాన్ని ఏర్పాటు చేసి వైరస్ తీవ్రతపై తమతో చర్చించారని ఎస్‌సిబిఎ శెక్రటరీ అశోక్ అరోరా చెప్పారు. కోర్టులో వైరస్ వ్యాప్తి చెందడం పైన, వ్యాక్సినేషన్ ఉద్యమం పైన అవగాహన కల్పించడానికి బుధవారం అవగాహన సమావేశం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. కోర్టులో సిజిహెచ్‌ఎస్ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడానికి వైరస్ నివారణకు తగిన చర్యలు తీసుకోడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం సుప్రీం కోర్టును సందర్శిస్తారని అరోరా తెలిపారు.

Swine Flu to Six Supreme Court Judges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News