Saturday, December 9, 2023

స్విట్జర్లాండ్‌లో 11 ఏళ్ల లోపు చిన్నారులకు టీకా

- Advertisement -
- Advertisement -

Switzerland Approves Covid Vaccination Of Children

జెనీవా : స్విట్జర్లాండ్‌లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా ఇవ్వడానికి రంగం సిద్దమైంది. ఫైజర్ బయోఎన్‌టెక్ తయారు చేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్ మెడిసిన్స్ ఏజెన్సీ స్విస్‌మెడిక్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్ , కెనడా, అమెరికా దేశాలు ఈ వయసు చిన్నారులకు టీకా ఇవ్వడానికి అనుమతించగా, ఈ దేశాల జాబితాలో ఇప్పుడు స్విట్జర్లాండ్ చేరింది. మూడు వారాల వ్యవధిలో కమిర్నాటి టీకాను రెండు డోసులను పంపిణీ చేస్తామని స్విస్‌మెడిసిన్ వెల్లడించింది. టీకా ఒమికాతీసుకున్న తరువాత పెద్దవారిలో కంటే తక్కువగా సైడ్ ఎఫెక్టులు ఉంటాయని తెలిపింది. టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News