Home తాజా వార్తలు ‘సైరా’ ట్రైలర్ విడుదల…

‘సైరా’ ట్రైలర్ విడుదల…

 

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ప్యాన్ ఇండియా హిస్టారికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను చిత్రయూనిట్ హైదరాబాద్ లో విడుదల చేసింది. ‘నరసింహారెడ్డి సామాన్యుడు కాడు.. అతడు కారణజన్ముడు. అతనొక యోగి.. అతనొక యోధుడు. అతన్ని ఎవ్వరూ ఆపలేరు’ అనే డైలాగ్స్‌ తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ‘ఈ భూమ్మీద పుట్టింది మేము. ఈ మట్టిలో కలిసేది మేము..మీకెందుకు కట్టాలిరా శిస్తు’ అంటూ చిరు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ లో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో న‌యనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. మీరు కూడా ఈ మూవీ ట్రైలర్ చూసి ఆనందించండి.

 

Sye RAA Movie trailer launch