Home జనగామ అర చేతిలో…. టీ-వాలెట్

అర చేతిలో…. టీ-వాలెట్

ఇక అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే
ఉద్యోగుల వేతనాల నుంచి ..ఉపాధి కూలీ డబ్బుల వరకు
సెల్‌ఫోన్ రీచార్జ్..కరెంటు బిల్లుల చెల్లింపులు
ఏడాదిలోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి

                   T-Wallet

రఘునాథపల్లి: రాష్ట్ర ప్రభుత్వం టీ-వాలెట్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఐటీ శాఖ దీనిని అద్భుతంగా రూపోందించింది.ప్రభుత్వం ప్రైవేటు సేవలు అవసరాలన్నింటీనీ ఈ యాప్‌కు లింక్ చేయడంతో అన్ని రకాల బిల్లులు చెల్లించుకోవచ్చు,సైబర్‌దాడులు,ఆన్‌లైన్ మోసాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోని ఈ యాప్‌ను రూపోందించారు.వచ్చే సంవత్సరంలోపు ఉద్యోగుల వేతనాలు,విద్యార్ధులకు అందించే ఉపకార వేతనాలు ,పించన్లు,ఉపాధిహామి కూలీ,సబ్సిడీలకు నేరుగా టీ-వాలెట్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..

ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.టీ-వాలెట్ తెలం గాణ అని టైప్ చేస్తే గులాబీ రంగులో వాలెట్ కనిపిస్తుంది.కింద ఐటీ డిపార్ట్ మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ఇలా..

ఈ యాప్‌లో పోన్‌నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.ఆధార్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం.దీని ద్వారా నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు చేయవచ్చు.టీ-వాలెట్ డౌన్‌లోడైనా తర్వాత ఓపెన్ చేయగానే రిజిస్టిర్ చేసుకోమని అడుగుతుంది.పోన్ నెంబర్ లేదా ఆధార్‌నెంబర్,ఈ-మెయిల్ ఉంటే నమోదు చేశాక రెండు సార్లు ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.దాన్ని ఎంటర్ చేస్తే టీ-వాలెట్‌లోకి లాగిన్ కావోచ్చు.

డబ్బులు వేయడం ఇలా..

డెబిట్‌కార్డు,క్రెడిట్ కార్డు,నెట్ బ్యాంకింగ్,క్యూర్ కోడ్ స్కానింగ్ ద్వారా డబ్బులను లోడ్ చేయవచ్చు.ఫండ్ ట్రాన్స్‌ఫర్ ,పేమనీ, కరెంటుబిల్, వాటర్‌బిల్,డీటీహెచ్,ల్యాండ్‌లైన్‌బిల్స్,డాటాకార్డ్,ఇంటర్‌నెట్‌బిల్స్,రీచార్జీ,బస్ టీకెట్స్ సేవలను ప్రస్తుతం అందిస్తున్నారు.త్వరలో ప్రభుత్వానికి సంబందించిన సుమారు 18 వేల మంది రేషన్‌డీలర్లను ఈ యాప్‌లోకి తీసుకు రానున్నారు. స్కాలర్ షిఫ్‌లు,ఫించన్లు,ఉపాధిహామీ డబ్బులు నేరుగా వినియోగదారుడి టీ-వాలెట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనేంది.