Tuesday, April 23, 2024

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌: తొలి వికెట్ కోల్పోయిన అఫ్ఘాన్..

- Advertisement -
- Advertisement -

షార్జా: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2021లో భాగంగా షార్జా స్టేడియంలో స్కాట్లాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘ‌నిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టుకు ఓపెనర్లు హజ్రాతుల్లా బజాయి(30), మహమ్మద్ షెహజాద్(22)లు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన షెహజాద్ ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్ కోల్పోయిన అఫ్ఘాన్ జట్టు 6 ఓవర్లు ముగిసే సరికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హజ్రాతుల్లా బజాయి(30), గుర్బాజ్(0)లు ఉన్నారు.

స్కాట్లాండ్: కైల్ కొయెట్జ‌ర్‌(కెప్టెన్‌), జార్జ్ మున్సె, కాల‌మ్ మెక్‌లియోడ్‌, రిచీ బెరింగ్‌ట‌న్‌, మాథ్యూ క్రాస్‌(వికెట్ కీప‌ర్‌), మైకెల్ లీస్క్‌, క్రిస్ గ్రీవ్స్‌, మార్క్ వాట్‌, జోష్ ద‌వే, స‌ఫ్యాన్ ష‌రీప్‌, బ్రాడ్ వీల్.

ఆఫ్ఘానిస్థాన్: హ‌జ్ర‌తుల్లా జ‌జాయ్, మ‌హ‌మ్మ‌ద్ షాహ్జాద్‌(వికెట్ కీప‌ర్‌), ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్‌, అస్ఘ‌ర్ ఆఫ్ఘాన్, మ‌హ‌మ్మ‌ద్ న‌బీ(కెప్టెన్‌), న‌జిబుల్లా జద్రాన్‌, గుల్బాదిన్ నైబ్‌, క‌రిమ్ జ‌న‌త్, ర‌షిద్ ఖాన్‌, న‌వీన్ ఉల్ హాక్‌, ముజీబ్ ఉర్ ర‌హ్మాన్.

T20 World Cup: AFG lost first wicket against SCO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News